క్వాంటమ్‌ మిషన్‌కు ఆమోదం

20 Apr, 2023 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: క్వాంటమ్‌ టెక్నాలజీలో శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనలు, అభివృద్ధికి  ఉద్దేశించిన నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌(ఎన్‌క్యూఎం)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదముద్ర వేసింది. దీనికి వచ్చే ఆరేళ్లలో రూ.6,003.65 కోట్లు వెచ్చిస్తారు. ఈ రంగంలో పరిశోధనలతో దేశంలో మరింత ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందని కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్‌ చెప్పారు.

క్వాంటమ్‌ కంప్యూటింగ్, క్వాంటమ్‌ కమ్యూనికేషన్, క్వాంటమ్‌ సెన్సింగ్‌ అండ్‌ మెట్రాలజీ, క్వాంటమ్‌ మెటీరియల్స్‌ అండ్‌ డివైజెస్‌ విభాగాల్లో నాలుగు థీమాటిక్‌ హబ్స్‌(టీ–హబ్స్‌) నెలకొల్పనున్నట్లు తెలియజేశారు. సినిమాటోగ్రఫీ (సవరణ) బిల్లు–2023కు కూడా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సినిమాల పైరసీకి అడ్డుకట్ట వేసే కఠినౖ నిబంధనలను బిల్లులో చేర్చినట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ తెలిపారు. వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెడతామని చెప్పారు. ప్రస్తుతమున్న యూ, ఏ, యూఏ అని కాకుండా ప్రేక్షకుల వయసుల విభాగం ఆధారంగా సినిమాలను వర్గీకరించనున్నట్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు