BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. భారీ ప్యాకేజీ

27 Jul, 2022 17:40 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్‌ఎన్‌ఎల్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్‌ఎన్‌ఎల్‌లో భారత్‌ బ్రాడ్‌బాండ్‌ నెట్‌వర్క్‌(బీబీఎన్‌ఎల్‌) విలీనానికి కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఫైబర్‌ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్‌ఎన్‌ఎల్‌ పునరుద్దరణ ప్యాకేజీకి కేబినెట్‌ అనుమతి తెలిపింది.

ఈ సందర్భంగా టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ.. బీఎస్‌ఎన్‌ఎల్‌ అప్పులను వాటాలుగా మారుస్తామని తెలిపారు. సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, ఫైబర్ నెట్‌వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి.. ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు.
చదవండి: సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు!

మరిన్ని వార్తలు