కేంద్ర కేబినెట్‌లో మార్పులు.. న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజు తొలగింపు

18 May, 2023 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్‌లో మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర న్యాయశాఖ నుంచి కిరణ్‌ రిజిజును తొలగించారు. కేంద్ర నూతన న్యాయశాఖ మంత్రిగా అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ను నియమించారు. కిరన్ రిజిజుకు ఎర్త్ సైన్సెస్ శాఖను అప్పగించారు.

కాగా అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌ రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి. ప్రభుత్వ ఉద్యోగం నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ మంత్రివర్గంలో పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. దీనికి అదనంగా న్యాయశాఖ బాధ్యతలు అప్పగించారు.
చదవండి: Rattan Lal Kataria: బీజేపీ ఎంపీ రతన్‌లాల్‌ కన్నుమూత

మరిన్ని వార్తలు