అమెజాన్ ఇండియాను బహిష్కరించాలి

18 Feb, 2021 17:52 IST|Sakshi

అమెజాన్ ఇండియా స్థానిక కార్యకలాపాలను నిషేధించాలని భారతీయ చిల్లర వ్యాపారుల బృందం బుధవారం ప్రభుత్వాన్ని కోరింది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫామ్‌లో భారతీయ చిరు వర్తకులకు వ్యాపార కలాపాల విషయంలో మోసాలు, అన్యాయాలకు పాల్పడినట్లు రాయిటర్స్ నివేదించింది. కఠినమైన విదేశీ పెట్టుబడి నిబంధనలను తప్పించుకునేందుకు భారత చట్టాలను ఉల్లంఘించినట్లు సీఐఐటి తెలిపింది. భారతదేశంలో 80 మిలియన్ల రిటైల్ దుకాణాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) ఒక ప్రకటనలో రాయిటర్స్ కథనంలోని "దిగ్భ్రాంతికరమైన విషయాలు వెల్లడి" అయ్యాయి కాబట్టి భారతదేశంలో అమెజాన్ కార్యకలాపాలను వెంటనే నిషేధించడానికి ఈ సమాచారం సరిపోతుంది అని పేర్కొంది.

"కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ అన్యాయమైన, అనైతికంగా వాణిజ్యాన్ని నిర్వహించడానికి భారతదేశం యొక్క ఎఫ్ డిఐ[ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్] చట్టాలను ఉల్లఘించినట్లు సిఐఐటి తెలిపింది. అమెజాన్, ప్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయని కన్ఫడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్(సిఏఐటి) కొన్ని సంవత్సరాలుగా వాణిజ్యశాఖ పరిధిలో పనిచేసే డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ కు ఎప్పటి నుంచో ఫిర్యాదులు చేస్తుంది. ఈ సమాచారాన్ని ఈడీకి చేరవేసింది డీపీఐఐటీ. ఈ క్రమంలోనే అమెజాన్‌పై ఈడీ దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. 

భారతీయ చిల్లర వ్యాపారుల బృందం దేశ బహిష్కరణ ప్రకటనలపై అమెజాన్ స్పందించలేదు. కానీ, సిఏఐటి అమెజాన్ నిషేధానికి పిలుపునిచ్చిన కొద్దికాలానికే రాయిటర్స్ నివేదికపై అమెజాన్ స్పందించింది. "ఇది ఆధారాలు లేని, అసంపూర్ణమైన, అసత్య ప్రచారం అని విమర్శించింది. అమెజాన్ భారతీయ చట్టాలకు లోబడి ఉంది అని" పేర్కొంది. "గత కొన్ని సంవత్సరాలుగా (ఎ) నిబంధనలలో అనేక మార్పులు జరిగాయి. అమెజాన్ ప్రతి సందర్భంలోనూ సమ్మతిని నిర్ధారించడానికి వేగంగా చర్యలు తీసుకుంది. అందువల్ల ఈ కథనం పాత సమాచారం ఉన్నట్లు అనిపిస్తుంది" అని తన అమెజాన్ ఇండియా న్యూస్ ట్విట్టర్ ఖాతాలో తెలిపింది.

అమెజాన్ సంస్థకు భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా ఉంది. బయటకు లక్షలాది మంది చిరు వర్తకులకు ప్లాట్ ఫాం అందిస్తున్నట్టు చెబుతున్న అమెజాన్, వాస్తవంలో పెద్ద కంపెనీలకే ఎక్కువ వ్యాపారన్ని అందిస్తోంది. అమెజాన్ సంస్థ కార్పొరేట్, తన వాటా దారులకే ఎక్కువ లబ్ధి చేకూరుస్తోందని కొందరు చిరు వర్తకులు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వాదనను అమెజాన్ ఖండించింది. భారత చట్టాలను తాము గౌరవిస్తున్నామని తెలిపింది.

చదవండి: అమెజాన్‌ ఇండియా భారీ మోసం!


 

మరిన్ని వార్తలు