ఛట్‌ పూజ చేసి వస్తుండగా కూలిన వంతెన.. ఐదుగురికి గాయాలు

31 Oct, 2022 20:31 IST|Sakshi

లక్నో:  ఛట్‌ పూజ వేడుకల్లో భారీ ప్రమాదం తప్పింది. సూర్యుడికి పూజలు చేసి తిరిగి వస్తుండగా పెద్దకాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. పలువురు చిన్న చిన్న గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చాకియా మండలం చందౌలీ ప్రాంతంలో సోమవారం జరిగింది. 

సారయ్య గ్రామ ప్రజలు సూర్యుడి పూజలు నిర్వహించి ఇళ్లకు తిరుగుపయణమయ్యారు. ఈ క్రమంలో కాలువపై ఉన్న వంతెన దాటేందుకు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో రావటంతో ​ కుప్పకూలింది. స్థానికులు అక్కడకు చేరి నీటమునిగిన వారిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలవగా వారిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. గుజరాత్‌లోని మోర్బీ జిల్లాలో మచ్చూ నదిపై తీగల వంతెన కూలిపోయి 140 మందికిపైగా మరణించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో బ్రిడ్జి ప్రమాదాలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మోర్బీ తరహాలోనే బ్రిడ్జిపైకి పెద్ద సంఖ్యలో జనం రావటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

ఇదీ చదవండి: మోర్బీ టూ కుంభమేళ.. దేశ చరిత్రలో పెను విషాదాలు ఇవే..

మరిన్ని వార్తలు