అమర్‌నాథ్‌ యాత్ర.. కొత్త బ్యాచ్‌లకు బ్రేక్‌

11 Jul, 2022 06:19 IST|Sakshi

జమ్మూ: తీవ్ర అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా జమ్మూ నుంచి కశ్మీర్‌లోని బేస్‌ క్యాంప్‌లకు చేరుకోవాల్సిన అమర్‌నాథ్‌ యాత్రికుల కొత్త బ్యాచ్‌లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

శుక్రవారం అమర్‌నాథ్‌ సమీపంలో సంభవించిన ఆకస్మిక వరదల్లో 16 మంది యాత్రికులు మృతి చెందగా మరో 40 మంది వరకు జాడ తెలియకుండా పోయిన విషయం తెలిసిందే. జూన్‌ 30వ తేదీ నుంచి మొదలైన 43 రోజుల అమర్‌నాథ్‌ యాత్ర ఆగస్ట్‌ 11వ తేదీన రక్షా బంధన్‌ రోజున ముగియనుంది.

మరిన్ని వార్తలు