పార్క్‌ చేసిన కారు క్షణాల్లో మాయం.. వీడియో వైరల్‌

13 Jun, 2021 17:29 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు మొత్తం జలమయం కావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వరదల దాటికి రోడ్లపై భారీ గుంతలు ఏర్పడుతున్నాయి. తాజాగా అపార్ట్‌మెంట్‌ ఆవరణలో పార్క్‌ చేసిన ఉన్న కారు క్షణాల్లో గుంతలో మునిగిపోవడం వైరల్‌గా మారింది.

ఘట్కోపర్‌ ప్రాంతంలోని ఒక అపార్ట్‌మెంట్‌ ఆవరణలో ఇది చోటుచేసుకుంది. అయితే కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై గుంతలు పడ్డాయి. అయితే బురదతో నిండిపోయి గుంత ఏర్పడడంతో కారు మెళ్లిగా మునగడం ప్రారంభమైంది. చూస్తుండగానే కారు ముందుబాగం మునిగింది.. కాసేపటి తర్వాత కారు పూర్తిగా గుంతలోకి దిగిపోయి బుడగలు తేలుతూ క్షణాల్లో మాయమైంది.అయితే దాని పక్కనున్న కార్లకు మాత్రం ఏం కాకపోవడం ఇక్కడ మరో విశేషం. దీనికి సంబంధించిన వీడియోనూ సుభోద్‌ శ్రీవాత్సవ అనే వ్యక్తి తన ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఇప్పటికే ఈ వీడియోను దాదాపు 50వేల మందికి పైగా వీక్షించారు.
చదవండి: మొసలి పంజా.. దెబ్బకు కోమాలోకి ; ఆ తర్వాత

Viral Video : మాట వినలేదని కాంట్రాక్టరుపై ఎమ్మెల్యే దాడి

మరిన్ని వార్తలు