Land For Job Scam: లాలు యాదవ్‌ భార్య, కూతుళ్లు, మరో 13 మందిపై సీబీఐ చార్జిషీట్‌

7 Oct, 2022 21:39 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేతృత్వంలో లాలు ప్రసాద్‌ యాదవ్‌ రైల్వే మంతిగా ఉన్న సమయలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ కుంభకోణంలో ఆర్జేడి నేత లాలు ప్రసాద్‌ యాదవ్‌, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి, ఇద్దరు ముఖ్యమంత్రులు, ప్రస్తుత బిహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, అలాగే రైల్వేలో ఉద్యోగాలు పొందిన 12 మందిని నిందితులుగా పేర్కొంటూ సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసిందని రైల్వే వర్గాలు తెలిపాయి.

ఈ చార్జిషీట్‌లో రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ సౌమ్య రాఘవన్‌ని కూడా నిందితుడిగా పేర్కొన్నారు. రాఘవన్‌ రైల్వే బోర్డు ఆర్థిక కమిషనర్‌గా పదవీ విరమణ చేశారు.  రైల్వేలో జరిగిన కుంభకోణానికి సంబంధించి సిబీఐ సెప్టెంబర్‌ 23, 2021న కేసు నమోదు చేసింది. ప్రాథమిక విచారణ తర్వాత దానిని మే 18న ఎఫ్‌ఐర్‌గా మార్చారు.

విచారణలో రైల్వే అధికారులు మితిమీరిన తొందరపాటుతో దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోనే గ్రూప్‌ డీ స్థానల్లో అభ్యర్థులను ప్రత్యామ్నాయంగా నియమించినట్లు తెలిపింది. ఈ కుంభకోణంలో వ్యక్తులు తమ పేరు, తమ దగ్గరి బంధువుల పేరు మీద భూములను బదలాయించనట్లు సీబీఐ వెల్లడించింది. ఈ భూమికి  అసలు ఉన్న రేటు కంటే తక్కువగా, అలాగే మార్కెట్లో ఉన్న ధర కంటే చాలా తక్కువ ధరకు సేకరించారు.

ఈ భూమి బదలాయింపు రబ్రీ దేవి, కుమార్తెలు భారతి, హేమ యాదవ్‌ల పేర్లతో బదలాయింపులు జరిగాయని సీబీఐ ఆరోపించింది. పాట్నాలో సుమారు 1.05 లక్షల చదరపు అడుగు భూమిని ప్రసాద్‌ కుటుంబ సభ్యులు అమ్మకందారులకు నగదు రూపంలో చెల్లించి స్వాధీనం చేసుకున్నారని కేంద్ర ఏజెన్సీ ఆరోపించింది. అలాగే ఈ నిందితుల్లో ఏడుగురు అభ్యర్థులు కూడా ఉన్నారని సీబీఐ పేర్కొంది.

(చదవండి: దాదాపు రూ. 5 లక్షలు మోసపోయిన ఇన్‌స్పెక్టర్‌... 9 ఏళ్లుగా కేసు నమోదుకాక..)

మరిన్ని వార్తలు