హథ్రాస్‌ ఘటన : నిందితుడిపై కేసు నమోదు చేసిన సీబీఐ

11 Oct, 2020 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కలకలం రేపిన హథ్రాస్‌ హత్యాచార కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ నిందితుడిపై కేసు నమోదు చేసింది. ఉత్తర్ ప్రదేశ్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హథ్రాస్‌ కేసు దర్యాప్తును యూపీ పోలీసుల నుంచి సీబీఐ స్వీకరించింది. సెప్టెంబర్‌ 14న బాధితురాలు పొలంలో పని చేసుకుంటూ ఉండగా.. దుండగులు ఆమెను లాక్కెళ్లి అత్యాచారం చేసి.. నాలుక కోసి తీవ్రంగా హింసించిన‍్నట్టు బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మెడ, వెన్నెముకకు తీవ్ర గాయాలయిన బాధితురాలిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆమె రెండు వారాలపాటు ప్రాణాలతో పోరాడి చివరకు సెప్టెంబర్‌ 29న కన్ను మూశారు.

ఇక హథ్రాస్‌ ఘటన యూపీ ప్రభుత్వం, రాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ కేసు పట్ల యూపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, బాధితురాలి కుటుంబం పట్ల నిర్థాక్షిణ్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లువెత్తాయి. బాధితురాలి కుటుంబ సభ్యులను ఇంట్లో బంధించి అర్ధరాత్రి ఆమె మృతదేహానికి పోలీసులు అంత్యక్రియలు నిర్వహించడం దుమారం రేపింది. చదవండి : హథ్రాస్‌: 60 మంది పోలీసులు.. 8 సీసీ కెమెరాలు 

మరిన్ని వార్తలు