అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్‌ఐఆర్‌

25 Apr, 2021 14:21 IST|Sakshi

న్యూఢిల్లీ/ముంబై: మహారాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి, నేషలిస్టు కాంగ్రెస్‌ పార్టీ(ఎస్ సిపీ) నాయకుడు అనిల్‌ దేశ్‌ముఖ్‌పై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆయన భారీగా ముడుపులు డిమాండ్‌ చేసినట్లు ముంబై మాజీ పోలీసు కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అనిల్‌ దేశ్‌ముఖ్‌పై దర్యాప్తు చేయాలని బాంబే హైకోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడితో పాటు గుర్తు తెలియని వ్యక్తులపై అవినీతి నిరోధక చట్టం కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి బలమైన ఆధారాలు లభించినట్లు అధికారులు తెలిపారు. అలాగే ముంబై, నాగపూర్‌లో అనిల్‌ దేశ్‌ముఖ్‌కు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ అధికారులు సోదాలు చేశారు. ఆయన వ్యక్తిగత సహాయకుడి నివాసంలోనూ సోదాలు జరిపారు.

చదవండి: 

ప్రాణవాయువును అడ్డుకుంటే ఉరి తీస్తాం!

మరిన్ని వార్తలు