సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు

29 Nov, 2022 07:22 IST|Sakshi

న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్‌ ఆఫీసర్‌ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. 

నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్‌ స్టోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఉంటున్నాడు. అడిషనల్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్‌ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్‌ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిచ్చింది.

మరిన్ని వార్తలు