కేజ్రీవాల్ ఎఫెక్ట్‌.. డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా ఇంట సీబీఐ రైడ్స్‌

19 Aug, 2022 09:11 IST|Sakshi

దేశవ్యాప్తంగా పలు కేసులకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీలోని ఆమ్‌ ఆ‍ద్మీ పార్టీపై సీబీఐ ఫోకస్‌ పెట్టింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియాకు సీబీఐ షాక్‌ ఇచ్చింది.
 
కాగా, శుక్రవారం ఉదయం ఢిల్లీలోని మనీష్‌ సిసోడియా నివాసం, సహా పరిసర ప్రాంతాల్లో 20కి పైగా ప్రదేశాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అయితే, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ(లిక్కర్‌ స్కామ్‌) కేసులో జరిగిన అవకతవకలపై కొనసాగుతున్న విచారణకు సంబంధించి ఈ దాడులు నిర్వహిస్తున్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. సీబీఐ దాడులపై మనీష్‌ సిసోడియా స్పందిస్తూ.. నా ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నేను సీబీఐ అధికారులకు సహాకరిస్తాను. అధికారులు నాకు వ్యతిరేకంగా ఎలాంటి పత్రాలను స్వాధీనం చేసుకోలేరు. దేశంలో మంచి చేసే వారిని ఇలా వేధింపులకు గురిచేయడం దురదుష్టకరం. విద్యా రంగంలో నేను చేస్తున్న పనిని ఎవరూ ఆపలేరు. నిజం బయటకు వస్తుంది అంటూ ట్విటర​్‌ వేదికగా కామెంట్స్‌ చేశారు.

కాగా, సీబీఐ సోదాల సందర్భంగా కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ.. సీబీఐకి స్వాగతం. మేము పూర్తి సహకారం అందిస్తాము. గతంలో కూడా సోదాలు దాడులు జరిగాయి, కానీ ఏమీ కనుగొనబడలేదు. ఇప్పుడు కూడా మీకు ఏదీ దొరకదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. కొద్ది రోజులుగా కేంద్రంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆప్‌ డిప్యూటీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించడం హాట్‌ టాపిక్‌గా మారింది. 

మరిన్ని వార్తలు