సుశాంత్‌ మృతిపై  సీబీఐ విచారణ

5 Aug, 2020 04:23 IST|Sakshi

సిఫారసు చేశామన్న బిహార్‌ సీఎం నితీశ్‌

పట్నా/ముంబై: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ తెలిపారు. సంచలనం సృష్టించిన ఈ కేసు దర్యాప్తును ఎవరు చేపట్టాలనే దానిపై పట్నా, ముంబై పోలీసుల మధ్య వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం నితీశ్‌ ట్విట్టర్‌లో ఈ మేరకు ప్రకటించారు. ‘సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ కూడా సీబీఐ దరాప్తునకు సమ్మతం తెలిపారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీజీపీని కోరాను. ఈ రోజే ఈ కేసును సీబీఐ విచారణకు పంపుతాం’అని పేర్కొన్నారు.

సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం ఐపీఎస్‌ అధికారిని ముంబైకి పంపించాం. అక్కడి పోలీసులు ఆయనను బలవంతంగా క్వారంటైన్‌కు పంపించారు. సీబీఐ అయితేనే ఈ కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేయగలదు’అని ఆయన వివరించారు. దీనిపై సుశాంత్‌ ప్రియురాలు రియా చక్రవర్తి తరఫు లాయర్‌ సతీశ్‌మానే షిండే స్పందించారు. ఎలాంటి సంబంధం లేకుండానే బిహార్‌ పోలీసులు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామనడం చట్టపరంగా చెల్లుబాటు కాదు. బిహార్‌ పోలీసులు నమోదు చేసిన జీరో ఎఫ్‌ఐఆర్‌ను ముంబై పోలీసులకు మాత్రమే పంపగలరు’ అని  తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు