సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

30 Jul, 2021 14:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యూకేషన్‌(సీబీఎస్‌ఈ) 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు సీబీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ cbseresults.nic.in లో ఫలితాలను చూసుకోవచ్చు. కరోనా కారణంగా ఈ ఏడాది పరీక్షలు రద్దయినందున టాపర్స్‌ మెరిట్‌ జాబితాను ప్రకటించడం లేదని తెలిపింది. మొత్తం 12,96,318 మంది విద్యార్థులు 99.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగింది. 2020లో 88.78 శాతం మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సంవత్సరం బాలుర కంటే బాలికలు 0.54% పైచేయి సాధించారు. బాలికల ఫలితాలు 99.67% కాగా, బాలురు 99.13% ఉత్తీర్ణత సాధించారు.

పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 30 శాతం, 11 వ తరగతిలో మార్కుల ఆధారంగా 30 శాతం, 12వ తరగతిలో మిడ్ టర్మ్, ప్రీ-బోర్డ్ పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చారు. ఇలా మొత్తం 100 శాతానికి మార్కులను లెక్కించి ఫలితాలను విడుదల చేసింది. క్వాలిఫైయింగ్ మార్కులు సాధించని విద్యార్థులను కంపార్మెంట్ కేటగిరీలో ఉంచనున్నారు. అయితే ఫలితాలపై సంతృప్తి చెందని విద్యార్థులకు కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తామని ఇప్పటికే సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.

మరిన్ని వార్తలు