30:30:40 ఫార్ములాతో సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు

17 Jun, 2021 12:33 IST|Sakshi

న్యూఢిల్లీ: 12వ తరగతి మార్కుల నిర్థారణ విధానాన్ని సీబీఎస్‌ఈ గురువారం ప్రకటించింది. 10,11వ తరగతి మార్కుల ఆధారంగా 12వ తరగతి మార్కులు ఇవ్వనున్నట్లు తెలిపింది. కాగా 30:30:40 ఫార్ములా ఆధారంగా ఫలితాలు విడుదల చేయనున్నట్లు సీబీఎస్‌ఈ పేర్కొంది. ఇందుకు సంబంధించిన మార్కుల ప్రణాళికను సీబీఎస్‌ఈ బోర్డు  గురువారం సుప్రీంకోర్టుకు  సమర్పించింది.

ఇందులో 10,11 తరగతుల మార్కుల నుంచి 30 శాతం వెయిటేజీ, 12వ తరగతిలో టెర్మ్‌ పరీక్షల నుంచి 40 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.ఈ విధానంతో సంతృప్తి చెందనివారు పరీక్షలకు హాజరుకావొచ్చని పేర్కొంది. కాగా జూలై 31లోపు సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలవుతాయని సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది.
చదవండి: 12వ తరగతి ఫలితాల నిర్ధారణపై కమిటీ

మరిన్ని వార్తలు