ఏడాది తర్వాతే కరోనా వ్యాక్సిన్

22 Oct, 2020 18:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ విరుగుడును కనిపెట్టేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు కష్టపడుతున్నారు. వ్యాక్సిన్‌ తయారీ కోసం ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా కృషి చేస్తున్నాయి. పలు దేశాల్లో తొలి దశ ప్రయోగాలను పూర్తి చేసుకుని చివరి దశ ప్రయోగాల్లో ఉంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలకు ఎదురచూస్తున్నారు. లక్షలాది మంది ప్రజలకు బలి తీసుకున్న మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సిన్‌ను వీలైనతం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. రానున్న కొత్త ఏడాది ప్రథమార్థంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వాలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజీ (సీసీఎంబీ) సంచలన ప్రకటన చేసింది. చాలా దేశాల్లో వ్యాక్సిన్‌ తయారీ ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉందని, వాటన్నింటినీ పూర్తి చేసుకుని అందుబాటులోకి రావాంటే మరో ఏడాది సమయం పటుడుతుందని తెలిపింది. ఈ మేరకు సీసీఎంబీ సీఈవో మదుసూధన్‌రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గురువారం ఈ వ్యాఖ్యలు చేశారు. కరోనా కేసులు మాత్రమే తగ్గాయి, తీవ్రత తగ్గలేదని అన్నారు. వైరస్‌ విజృంభణ ఇలానే కొనసాగితే మరోసారి దేశంలో లాక్‌డౌన్‌ విధించక తప్పదని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ మాస్క్‌లు ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం తయారువుతున్న వ్యాక్సిన్స్‌లో ఏది ఏవిధంగా పనిచేస్తుందో కూడా చెప్పలేమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ దేశాల్లో చాలా కష్టపడుతున్నాయని, కానీ అనుకున్నంత సామన్యంగా అందుబాటులోకి రాదని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు