పట్టుబడ్డ దొంగను స్టేషన్‌కి తరలిస్తుండగా..హఠాత్తుగా పోలీసుపై కత్తితో..

11 Jan, 2023 14:25 IST|Sakshi

మొబైల్‌ ఫోన్‌ దొంగతనం కేసు విషయమై ఒక దొంగను పట్టుకుని తరలిస్తుండగా అనుహ్యంగా పోలీసుపై దాడి చేశాడు. అదీకూడా అందరూ చూస్తుండగా పట్టపగలే దాడి చేసి పారిపోయేందుకు యత్నించాడు. ఈ ఘటన ఢిల్లీలో మయపూరీలోని ఒక స్లమ్‌ ఏరియాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..పశ్చిమ ఢిల్లీలోని మాయపురిలో అనిష్‌ రాజ్‌ అనే దొంగ ఒక మహిళ ఫోన్‌ని దొంగలించాడు. దీంతో ఆ మహిళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఏఎస్‌ఐ శంభు దయాల్‌  ఈ కేసు విషయమే ఆ మహిళను తీసుకుని సంఘటనా స్థలానికి వచ్చి విచారించగా..సదరు మహిళ అనీష్‌ను చూపిస్తూ ఇతనే నా భర్త ఫోన్‌ దొంగలించాడనే చూపించింది.

దీంతో వెంటనే దయాల్‌ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్టేషన్‌కి తరలిస్తుండగా ఒక్కసారిగా జేబులోంచి కత్తిని తీసి పోలీసు ఛాతి, మెడ, వెన్నుపై ఏకంగా 12 సార్లు దాడి చేశాడు. పాపం ఆ పోలీసుల వాటిని లెక్కచేయకుండా అతన్ని ఆపేందుకు యత్నించాడు. ఐతే నిందితుడు సదరు పోలీస్‌ని తోసేసి పారిపోయాడు. దీంతో అక్కడే ఉన్న జనం ఒక్కసారిగా స్పందించి..నిందితుడిని వెంబడించారు. సమీపంలో ఉన్న మరో పోలీసు అతడ్ని పట్టుకుని అరెస్టు చేశాడు. ఆ ఘటన మొత్తం సమీపంలోని సీసీఫుటేజ్‌లో రికార్డు అయ్యింది కూడా.

ఐతే గాయపడిన ఏఎస్‌ఐని హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. దురదృష్టవశాత్తు ఆయన నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి మృతి చెందారు. రాజస్తాన్‌లోని సికార్‌కు చెందిన శంభు దయాల్‌కి ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్విట్టర్‌ వేదికగా సదరు పోలీసు శంభూజీకి నివాళులర్పించారు. అంతేగాదు ట్విట్టర్‌లో...ప్రజలను రక్షించడం కోసం ప్రాణాలను సైతం పట్టించుకోని మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం. మీ ప్రాణానికి విలువ కట్టలేం కానీ మీ గౌరవార్థం కోటి రూపాయల గౌరవ వేతనం ఇస్తున్నాం అని అన్నారు.

(చదవండి: సెకనులో అంతా అయిపోయింది..సర్వం కోల్పోయా! విలపిస్తున్న బాధితురాలి భర్త)

మరిన్ని వార్తలు