బిహార్‌ ఫలితాలు : కాషాయ శ్రేణుల్లో కోలాహలం

10 Nov, 2020 15:17 IST|Sakshi

పట్నా : బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమిపై ఎన్డీయే స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో బీజేపీ మహిళా మోర్చా సభ్యులు సంబరాలు జరుపుకున్నారు. ఢోలక్‌ మోగించడంతో పాటు రంగులు చల్లుతూ హర్షం వ్యక్తం చేశారు. ఇక బిహార్‌లో ఎన్డీయే కూటమి 18 స్ధానాల్లో గెలుపొంది 107 స్ధానాల్లో ఆధిక్యం కనబరుస్తుండగా, ఆర్జేడీ సారథ్యంలోని మహాకూటమి 9 స్ధానాల్లో గెలుపొంది 97 స్ధానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్జేపీ 2 స్ధానాల్లో, ఇతరులు 10 స్ధానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మొత్తం 243 స్ధానాలున్న బిహార్‌ అసెంబ్లీలో అధికారం దక్కాలంటే అవసరమైన మేజిక్‌ ఫిగర్‌ 122 స్ధానాలను దక్కించుకునే దిశగా ఎన్డీయే కూటమి సాగుతోంది. మరోవైపు బిహార్‌లో అర్ధరాత్రి దాటేవరకూ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఎన్నికల కమిషన్‌ ప్రకటించడంతో పూర్తి ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు