స్వాతంత్య్ర దినోత్సవం: ప్రముఖుల విషెస్‌

15 Aug, 2020 09:08 IST|Sakshi

74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి రామ్‌నాధ్‌ కోవింద్‌ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్ర్య దేశంలో పుట్టడం మనందరి అదృష్టమని ఆయన అన్నారు. ఎందరో వీరుల ప్రాణ త్యాగాలు పోరాటల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది అని, వారందరిని ఈ సందర్భంగ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది కరోనాలాంటి విపత్కర పరిస్థితులను దేశం ఎదుర్కొంటుందని, ఈ పోరాటంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా మంది వలస కార్మికులు, సామాన్యుల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వారందరిని ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. అలాగే గల్వన్‌ లోయలో చైనా చేసిన దురాక్రమణలను విజయవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. ఐకమత్యంగా ఉండి  దేశ ఉన్నతికి  పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. 

దేశ ప్రజలందరికి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతి చెప్పిన మాటలు 130 మంది భారతీయులలో స్ఫూర్తిని నింపాయని కొనియాడారు. దేశ ప్రజలందరూ జాతి ఉన్నతికి, అభివృద్ధికి, సమగ్రతకు, ఐక్యతకు పాటు పడాలని మోదీ  పిలుపునిచ్చారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహు ప్రధాని మోదీతో పాటు దేశ ప్రజలందరికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ రోజు మనం  అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యానికి కారణమయిన అమరవీరులకు, దేశ భక్తులకు నా కృతజ్ఞతలు. మన దేశ విలువలు కాపాడుతూ, జాతి అభ్యున్నతికి పాటు పడతామని ఈ సందర్భంగా అందరం ప్రతిజ్ఞ చేద్దాం’అని ఆయన ట్వీట్‌ చేశారు. 

కేంద్రమంత్రి  స్మృతి ఇరానీ దేశ ప్రజలందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ప్రజలందరికి  ట్విట్టర్‌ వేదికగా 74 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర వీరులందరికి కృతజ్ఞతలు తెలిపారు.  


 
 

    

మరిన్ని వార్తలు