ఎర్ర కందిపప్పుపై దిగుమతి పన్ను రద్దు

27 Jul, 2021 09:55 IST|Sakshi

అగ్రి ఇన్‌ఫ్రా డెవలప్‌మెంట్‌ సెస్‌ సగానికి తగ్గింపు

పార్లమెంట్‌లో ప్రకటించిన కేంద్రం

న్యూఢిల్లీ: దేశీయంగా సరఫరా పెంచేందుకు, పెరుగుతున్న ధరలకు చెక్‌ పెట్టేందుకు ఎర్ర కందిపప్పుపై దిగుమతి సుంకాన్ని కేంద్రం రద్దు చేసింది. దీంతోపాటు, ఎర్ర కందిపప్పుపై అగ్రికల్చర్‌ ఇన్‌ఫ్రాక్చర్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ను 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించినట్లు తెలిపింది. ఈ నిర్ణయం మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌ ఉభయసభలకు తెలిపారు. ఏప్రిల్‌ ఒకటో తేదీనాటికి బహిరంగ మార్కెట్‌లో ఎర్ర కందిపప్పు ధర కిలో రూ.70 ఉండగా, అది ప్రస్తుతం 21 శాతం మేర పెరిగి కిలో రూ.85కు చేరుకున్నట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ పేర్కొంది.
 

ముసాయిదా రూపకల్పనలో  ఉన్నత విద్యా కమిషన్‌ బిల్లు
హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఈసీఐ) ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదా రూపకల్పన ప్రక్రియ కొనసాగుతోందని లోక్‌సభలో విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు.  జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ)–2020లో ప్రతిపాదించిన విధంగానే  నాలుగు స్వతంత్ర వ్యవస్థలను ఒకే గొడుగు కిందికి తెస్తూ ముసాయిదా రూపకల్పన చేస్తున్నామని ప్రధాన్‌ పేర్కొన్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ), ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌(ఏఐసీటీఈ), నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) వంటి వ్యవస్థల స్థానంలో హెచ్‌ఈసీఐ రానుంది. 

మరిన్ని వార్తలు