పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీల్లో మనోళ్లు

29 Sep, 2020 19:56 IST|Sakshi

న్యూఢిల్లీ: శాఖల వారీగా మరింత జోరుగా పరిపాలన సాగించేందుకు కేంద్రం సిద్ధమైంది. మంగళవారం స్టాండింగ్‌ కమిటీలకు సభ్యులను నియమించింది. అన్ని పార్టీల ఎంపీలనూ పరిపాలనలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తూ... స్టాండింగ్ కమిటీల్లో వివిధ పార్టీల ఎంపీలకు బాధ్యతలు అప్పగించింది. ఈ కమిటీల్లో చాలా వాటికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ఎంపీలను సభ్యులుగా నియమించింది. ఆయా స్టాండింగ్‌ కమిటీలకు ఎంపికైన తెలుగు రాష్ట్రాల ఎంపీల వివరాలు..

స్టాండింగ్‌ కమిటీ                      సభ్యులు
ఆర్థిక శాఖ                           మిథున్ రెడ్డి, సీఎం. రమేష్, జీవీఎల్ నరసింహారావు 
పరిశ్రమల శాఖ                     వైఎస్ అవినాష్ రెడ్డి 
వాణిజ్య శాఖ                        బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ 
హెచ్ఆర్డీ                              లావు శ్రీకృష్ణదేవరాయలు , గల్లా జయదేవ్ 
ఆరోగ్యశాఖ                           టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత 
న్యాయశాఖ                          టీఆర్ఎస్ ఎంపీలు సురేష్రెడ్డి, వెంకటేష్ నేత 
ఐటీ శాఖ                             వైఎస్ఆర్‌సీ ఎంపీ సత్యనారాయణ, టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి 
రక్షణ శాఖ                           రేవంత్ రెడ్డి, కోటగిరి శ్రీధర్, లక్ష్మీకాంత్ 
ఇంధన శాఖ                        ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
కార్మిక శాఖ                        టీఆర్ఎస్ ఎంపీలు బండ ప్రకాష్‌, పసునూరి దయాకర్
రైల్వే శాఖ                          రెడ్డప్ప, సంతోష్ కుమార్ 
పట్టణాభివృద్ధి శాఖ               బండి సంజయ్
కెమికల్ అండ్ ఫర్టిలైజర్‌ శాఖ   నందిగం సురేష్ 
బొగ్గు,ఉక్కు  శాఖ                  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్ 
గ్రామీణ అభివృద్ధి శాఖ             తలారి రంగయ్య

మరిన్ని వార్తలు