ఐదేళ్లలో 95.47 కోట్లు; 2019-20లో 37 కోట్లు!

16 Sep, 2020 15:29 IST|Sakshi

కేంద్ర హోంశాఖ లిఖితపూర్వక సమాధానం

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాను వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాగా పరిగణిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. భద్రతా పరమైన ఖర్చు (సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్‌పెండిచర్) స్కీమ్ పరిధిలో ఈ జిల్లా ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీకి ఈ పథకం కింద 2019-20లో రూ. 37.23 కోట్లు ఇచ్చినట్లు వెల్లడించింది. గత ఐదేళ్లలో మొత్తంగా 95.47 కోట్లు ఇచ్చినట్లు పేర్కొంది.(చదవండి: అరకు లోయ పర్యాటకులకు రైల్వే శుభవార్త

ఇందులో భాగంగా నక్సలైట్ల లొంగుబాట్లను ప్రోత్సహించే పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపింది. లొంగిపోయినవారు వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా శిక్షణ ఇవ్వడంతో పాటుగా..  ఆ సమయంలో నెలకు రూ. 6,000 స్టైపండ్ కూడా ఇస్తున్నట్లు వెల్లడించింది. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా పలువురు ఎంపీల ప్రశ్నలకు రాజ్యసభలో కేంద్ర హోంశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

కేజీ బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ !
దేశవ్యాప్తంగా సహజవాయువు, పెట్రోలియం లభ్యతపై అధ్యయనం జరిగిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తెలిపారు. తాజా అధ్యయనాల ప్రకారం 42 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ లభ్యత ఉందని అంచనాలున్నాయన్నారు. కేజీ(కృష్ణా- గోదావరి) బేసిన్లో 9.55 బిలియన్ టన్నుల ఆయిల్ ఉందనే అంచనాలు ఉన్నట్లు తెలిపారు. ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణ జిల్లాల్లో ఎక్కువ లభ్యత ఉందన్నారు. ఈ మేరకు బీజేపీ ఎంపీ టీజీ వెంకటేశ్ ప్రశ్నకు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా