లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పణ గడువు పెంపు

12 Sep, 2020 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ : కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌ దారులకు  శుభవార్త. నవంబర్‌ చివరిలోగా సమర్పించాల్సిన లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును ఈ ఏడాది చివరి వరకూ పొడిగిస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.  ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  ఓ ప్రకటన విడుద‌ల  చేశారు.

అంతేకాకుండా  80 ఏళ్లు దాటినవారు అక్టోబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31లోగా లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించవచ్చని తెలిపారు. అప్పటి వరకూ వారి పెన్షన్‌ పంపిణీకి ఎలాంటి ఢోకా ఉండ‌బోద‌ని పేర్కొన్నారు. వృద్ధుల‌కు కరోనా సోకే ప్రమాదం ఎక్కువగా  ఉన్న కార‌ణంగా లైఫ్‌ సర్టిఫికెట్‌ గడువును పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  ఆయా బ్యాంకులు వీడియో ఆధారిత గుర్తింపు కాల్‌ (వీ సిప్‌) ద్వారా వారిని గుర్తించి పెన్షన్‌ ఇవ్వాల్సిందిగా అధికారుల‌కు సూచించారు.

చదవండి: గుడ్‌ న్యూస్‌ చెప్పిన భారత్‌ బయోటెక్‌

మరిన్ని వార్తలు