విద్యుత్‌ కొరత: మిగులు కరెంట్‌ని అమ్మితే చర్యలు: కేంద్రం

12 Oct, 2021 12:50 IST|Sakshi

ఢిల్లీ: దేశంలోని వివిధ థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరత వల్ల విద్యుత్ కొరత ఏర్పడనుందని అనేక రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విద్యుత్‌ కొరతపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మిగులు విద్యుత్ ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలు, కొరత ఉన్న రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా చేయాలని విజ్ఞప్తి చేసింది. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ల వద్ద ఉన్న 15 శాతం అన్ అలకేటెడ్ కోటా నుంచి విద్యుత్ వాడుకోవాలని విన్నవించింది. 
(చదవండి: విద్యుత్‌ సంక్షోభం.. జనాలకు ఢిల్లీ ప్రభుత్వం వింత రిక్వెస్ట్‌)

బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి ప్రస్తుతం డిమాండ్ బాగా పెరిగింది.కొన్ని రాష్ట్రాలు ప్రజలకు విద్యుత్ కోతలు పెడుతూ బయట రాష్ట్రాలకు పవర్ అమ్ముతున్నారు. ఈ క్రమంలో కేంద్రం మిగులు కరెంట్‌ను పవర్ ఎక్స్చేంజిలలో అమ్మితే ఆ రాష్ట్రాల కేటాయింపులు తగ్గించేస్తామని కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్‌ శాఖ మంగళవారం రాష్ట్రాలకు లేఖ రాసింది. 

చదవండి: తెలంగాణలో బొగ్గు కొరత లేదు

మరిన్ని వార్తలు