ఆంధ్రప్రదేశ్‌కు మరో రూ.879 కోట్లు విడుదల

7 May, 2022 08:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ సహా 14 రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రెండో నెల వాయిదాగా  రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాల మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.86,201 కోట్లుండగా.. అందులో 14 రాష్ట్రాలకు పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు(పీడీఆర్‌డీ) గ్రాంట్‌ రెండో నెలవారీ వాయిదాను శుక్రవారం కేంద్రం విడుదల చేసింది. 2022ృ23కి ఆంధ్రప్రదేశ్‌కు సిఫార్సు చేసిన పోస్ట్‌ డెవల్యూషన్‌ రెవెన్యూ లోటు గ్రాంట్‌ రూ.10,549 కోట్లు కాగా, రెండో నెల విడతగా రూ.879.08 కోట్లను కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అందించింది.

మరిన్ని వార్తలు