జీఎస్‌టీ‌పై కేంద్రం కీలక నిర్ణయం?

19 Feb, 2021 18:19 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతోందా అంటే? ప్రస్తుతం వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే.. అవును అనే సమాధానం వినిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం జీఎస్‌టీ విధానాన్ని మరింత సరళతరం చేయాలని చూస్తుంది. వస్తువు సేవల పన్ను(జీఎస్‌టీ‌) రేట్లను 12శాతం, 18శాతం గల ట్యాక్స్ స్లాబ్స్‌ను ఒకే స్లాబ్‌లో విలీనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వచ్చే నెల మార్చిలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఈ విషయంపై చర్చించవచ్చని ఆ అధికారి తెలిపారు.

భారతదేశంలో ప్రస్తుతం నాలుగు జీఎస్‌టీ స్లాబు రేట్లు 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతంగా ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్స్, పొగాకు, ఎరేటెడ్ డ్రింక్స్ వంటి లగ్జరీ & డీమెరిట్ వస్తువులపై ప్రత్యేక సెస్ కూడా ఉంది. పైన చెప్పిన జీఎస్‌టీ స్లాబులలో 12శాతం, 18శాతం రేట్లను కలిపి తక్కువ స్లాబ్ గా తీసుకొస్తే సామాన్యులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఒకవేల నిజంగానే మార్చిలో జరిగే తదుపరి (జీఎస్‌టీ) కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంటే మూడు ట్యాక్స్ స్లాబులు ఉంటాయని చెప్పుకోవచ్చు. దీనిపై 15వ వేతన కమిషన్ కూడా 12, 18 శాతం స్లాబులను కలిపేయాలని గతంలో సిఫార్సు చేసింది.

చదవండి:

సెకండ్ హ్యాండ్ వాహనాల అమ్మకాల్లో ఇవే టాప్!

బంగారం రుణాలపై తాజా వడ్డీ రేట్లు ఇవే!

మరిన్ని వార్తలు