కేంద్ర ఉద్యోగులకు బోనస్‌ 

20 Oct, 2021 09:53 IST|Sakshi

న్యూఢిల్లీ: 2020–21 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు తాత్కాలిక బోనస్‌ను మంజూరుచేసింది. కేంద్ర పారా మిలటరీ బలగాలు, సాయుధ బలగాలకూ ఈ బోనస్‌ను మంజూరుచేసినట్లు కేంద్ర ఖర్చుల వ్యవహారాల విభాగం పేర్కొంది. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఉద్యోగంలో ఉన్నవారు, 2020–21 కాలంలో మధ్యలో ఎలాంటి విరామంలేని ఆరునెలల కనిష్ట సర్వీస్‌కాలం ఉన్నవారు ఈ బోనస్‌ పొందేందుకు అర్హులు.

ఉత్పత్తి ఆధారిత బోనస్‌ పథకాలతో లబ్దిపొందని గ్రూప్‌–బి నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగులు, గ్రూప్‌–సీ ఉద్యోగులకు ఈ తాత్కాలిక బోనస్‌ను ఇవ్వనున్నారు. ఈ బోనస్‌ను లెక్కించేటపుడు గరిష్టంగా రూ.7,000 వేతనాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. 30 రోజుల వేతనాన్ని బోనస్‌గా చెల్లిస్తారు.   

చదవండి: టీకా రెండో డోస్‌పై దృష్టి పెట్టండి

మరిన్ని వార్తలు