రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు

19 Jun, 2021 12:51 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను సడలిస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా పలు సూచనలు చేస్తూ శనివారం లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని తెలిపారు.

టెస్టింగ్‌, ట్రాక్, ట్రీట్‌, వ్యాక్సిన్‌ నియమాలను పాటించాలని సూచించారు. వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనా చైన్‌ సిస్టమ్‌ను విచ్ఛిన్నం చేయడం కీలకం అని లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని.. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు పునఃప్రారంభించాలని సూచించారు.

చదవండి: Covid Vaccine: వ్యాక్సిన్ల సేకరణ ఎలా? 

మరిన్ని వార్తలు