ఏపీ సర్కార్‌పై ఎల్లో మీడియా విషం.. పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడైన వాస్తవాలు

25 Jul, 2022 17:40 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లోక్‌సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పుల వివరాలను వెల్లడించారు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రాష్ట్రాలు మూడు ఉన్నాయి. రూ.6 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు తమిళనాడు, యూపీ, మధ్యప్రదేశ్.. రూ.5 లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రం బెంగాల్‌. రూ. 4లక్షల కోట్లకు పైగా అప్పులున్న రాష్ట్రాలు కర్ణాటక, గుజరాత్‌. జనాభా తక్కువ ఉన్న కేరళ అప్పులు రూ.3.35 లక్షల కోట్లు ఉండగా, అప్పుల్లో తమిళనాడు నంబర్‌వన్‌గా ఉంది.
చదవండి: మరింత పారదర్శకత, జవాబుదారీతనం పెరగాలి: సీఎం జగన్‌

తమిళనాడు అప్పులు రూ.6.59 లక్షల కోట్లు కాగా.. రెండు, మూడు స్థానాల్లో యూపీ, మధ్యప్రదేశ్‌ ఉన్నాయి. బీజేపీ పాలిత యూపీ అప్పులు రూ.6.53 లక్షల కోట్లు, బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌ అప్పులు రూ.3.17 లక్షల కోట్లు, బీజేపీ పాలిత గుజరాత్‌  అప్పులు రూ.4.02 లక్షల కోట్లు, కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ అప్పులు రూ.4.77 లక్షల కోట్లు. తృణమూల్‌ అధికారంలో ఉన్న బెంగాల్‌ అప్పులు రూ.5.62 లక్షల కోట్లు.

ధనిక రాష్ట్రమైన తెలంగాణకు 3.12 లక్షల కోట్ల అప్పులు ఉండగా, ఏపీకి అప్పులు రూ.3.98 లక్షల కోట్లు ఉన్నాయి. ఎక్కువ అప్పులు చేశారంటూ సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఎల్లో మీడియా విషం చిమ్ముతున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్‌ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయి.

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు తీసుకున్న అప్పులు
ఆంధ్రప్రదేశ్: 3,98,903 లక్షల కోట్లు
అరుణాచల్ ప్రదేశ్: 15, 122 వేల కోట్లు
అస్సాం: 1,07,719 లక్షల కోట్లు
బీహార్: 2,46,413 లక్షల కోట్లు
చత్తీస్‌గఢ్‌: 1,14,200 లక్షల కోట్లు
గోవా: 28,509 వేలకోట్లు
గుజరాత్: 4,02,785 లక్షల కోట్లు
హర్యానా: 2,79,022 లక్షల కోట్లు
హిమాచల్ ప్రదేశ్: 74,686 వేల కోట్లు
ఝార్ఖండ్: 1,17,789 లక్షల కోట్లు
కర్ణాటక: 4,62,832 లక్షల కోట్లు
కేరళ: 3,35,989 లక్షల కోట్లు 
మధ్యప్రదేశ్: 3,17,736 లక్షల కోట్లు
మహరాష్ట్ర: 6,08,999 లక్షల కోట్లు
మణిపూర్: 13,510 వేల కోట్లు
మేఘాలయ: 15,125 వేల కోట్లు
మిజోరాం: 11,830 వేల కోట్లు
నాగాలాండ్: 15,125 వేల కోట్లు
ఒడిశా: 1,67,205 లక్షల కోట్లు
పంజాబ్: 2,82,864 లక్షల కోట్లు
రాజస్థాన్: 4,77,177 లక్షల కోట్లు
సిక్కిం: 11,285 వేల కోట్లు
తమిళనాడు: 6.59 లక్షల కోట్లు
తెలంగాణ: 3,12,191 లక్షల కోట్లు
త్రిపుర: 23,624 వేల కోట్లు
ఉత్తప్రదేశ్: 6,53,307 లక్షల కోట్లు
ఉత్తరాఖండ్: 84,288 వేల కోట్లు
వెస్ట్ బెంగాల్: 5,62,697 లక్షల కోట్లు

మరిన్ని వార్తలు