దేశంలో కోవిడ్‌ రెండోవేవ్‌ మధ్యలో ఉంది: కేంద్రం

26 Aug, 2021 18:20 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశంలో కోవిడ్‌ రెండోవేవ్‌ మధ్యలో ఉందని కేంద్రం పేర్కొంది. కేరళలో లక్షకుపైగా యాక్టివ్‌ కేసులు ఉన్నాయని.. మొత్తం యాక్టివ్‌ కేసుల్లో కేరళలోనే సగం కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పండగల నేపథ్యంలో సెప్టెంబరు, అక్టోబరులో మరింత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. టీకా తీసుకున్నా మాస్కులు ధరించాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కాగా, దేశంలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 46,164 కరోనా కేసులు నమోదవ్వగా.. 607 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,25,58,530కి చేరగా.. మృతుల సంఖ్య 4,36,365గా ఉంది. ఇక కరోనా నుంచి కొత్తగా 34,159 మంది కోలుకోగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 3,17,88,440 మంది ఉన్నారు. ప్రస్తుతం దేశంలో 3,33,725 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. దేశం మొత్తంమీద చూసుకుంటే కేరళలోనే కరోనా కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే 31,445 కరోనా కేసులు నమోదయ్యాయి.  కరోనా కేసులు పెరగడంలో ఓనం వేడుకలు కారణమని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.

ఇవీ చదవండి:
సముద్రంలో అల్లకల్లోలం: ముందుకొచ్చి.. వెనక్కి మళ్లి..
రెండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్‌

మరిన్ని వార్తలు