వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు

19 May, 2021 17:57 IST|Sakshi

న్యూఢిల్లీ: వ్యాక్సినేషన్‌పై కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటి ప్రకారం ఇక పై కరోనా నుంచి కోలుకున్న వారు మూడు నెలల తర్వాత వ్యాక్సిన్  తీసుకోవచ్చని కేంద్రం తాజాగా వెల్లడించింది. ఇటీవల 45 రోజుల వ్యవధి ఉండగా ప్రస్తుతం దాన్ని మూడు నెలలకు పెంచింది.

మొదటి డోసు తీసుకున్న తర్వాత కరోనా వస్తే రెండు డోసును మూడు నెలల తర్వాత తీసుకోవాలని కేంద్రం సూచించింది. బాలింతలు కూడా టీకా తీసుకోవచ్చని సూచించింది. వ్యాక్సిన్ ఇచ్చేముందు రాపిడ్ యాంటిజెన్‌ అవసరంలేదని స్పష్టం చేసింది. కోవిడ్‌ వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఏర్పాటైన జాతీయ నిపుణుల బృందం ఈ మేరకు చేసిన సూచనలను కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదించింది.

చదవండి: ‘టీకాలను భారత్‌లో కన్నా విదేశాలకే అధికంగా పంపిణీ చేశాం 

మరిన్ని వార్తలు