‘నడ్డాను చంపాలని చూశారు’

10 Dec, 2020 19:20 IST|Sakshi

నడ్డాపై జరిగిన దాడిని ఖండించిన కేంద్రమంత్రులు

సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై జరిగిన దాడిని కేంద్ర మంత్రులు తీవ్రంగా ఖండించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) నేతల ఆధ్వర్యంలోనే దాడి జరిగిందని కేంద్ర మంత్రులు పియూష్‌ గోయల్‌, నరేంద్రసింగ్‌ తోమర్‌ ఆరోపించారు. టీఎంసీ నేతలు జేపీ నడ్డాను చంపాలని ప్రయత్నించారని, బుల్లెట్ ప్రూఫ్‌ కారు ఉంది కాబట్టే  ఆయన బతికి బయట పడ్డారన్నారు.ఈ  ఘటనపై దర్యాప్తు జరిపించి నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 
(చదవండి : బెంగాల్‌లో నడ్డా కాన్వాయ్‌పై దాడి)

కాగా, రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్‌లో పర్యటిస్తున్ననడ్డా, కైలాష్ విజయవర్గియా గురువారం డైమండ్‌ హర్బర్‌లో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ సమయంలో టీఎంసీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిల్చుని బీజేపీ వ్యతిరేక నినాదాలు చేయడమే కాక రోడ్డు బ్లాక్‌ చేయడానికి ప్రయత్నించారు. అంతటితో ఊరుకోక నడ్డా ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై రాళ్లు రువ్వారు.

దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా : బండి సంజయ్‌
జేపీ నడ్డాపై దాడిని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా ఖండించారు. ఒక జాతీయ పార్టీ అధ్యక్షు, కేంద్రంలో అధికారంలో పార్టీకి సారధి అయిన నడ్డా కాన్వాయిపై రాళ్లు రువ్వడం పశ్చిం బెంగాల్‌లో శాంతిభద్రతు ఎంత అధ్వాన్నంగా ఉన్నయో రుజువు చేస్తోందని విమర్శించారు. బెంగాల్‌లో తృణముల్‌ కాంగ్రెస్‌, జాతీయ కాంగ్రెస్‌, కమ్యూనిస్టు కలిసి బీజేపీ పైన ఇటువంటి దాడులు నిర్వహించి కార్యకర్తలను చిత్రహింసకు గురిచేయడం, హత్య చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారిందని మండిపడ్డారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలకు బీజేపీ కార్యకర్తలు బయపడరని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు