దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ కేసులు: కేం‍ద్రం

25 Jun, 2021 19:09 IST|Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 48 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు నమోదైనట్లు కేంద్రం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసుల్లో 20 కేసులు మహారాష్ట్రలోనే నమోదైనట్లు తెలిపింది.కాగా రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్‌పై అధ్యయనం చేపట్టామని.. సెప్టెంబర్‌ నాటికి అధ్యయనం ఫలితాలు వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఇక మధ్యప్రదేశ్‌లో రెండు డెల్టా వేరియంట్‌ మరణాలు చోటుచేసుకోగా.. తాజాగా మహారాష్ట్రలోనూ డెల్టా వేరియంట్‌ మరణం వెలుగుచూసింది.

చదవండి: మహారాష్ట్రలో తొలి డెల్టా ప్ల‌స్ వేరియంట్ మరణం

మరిన్ని వార్తలు