8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం

6 Jul, 2021 12:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం 8 మంది కొత్త గవర్నర్‌ పేర్లను ప్రకటించింది. మిజోరాం గవర్నర్‌గా విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు. హిమాచల్‌ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ అయ్యారు. కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌(ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్నారు), గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌ను కేంద్రం ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ నియమితులయ్యారు. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణకు ముందే కేంద్రం.. గవర్నర్ల నియామకాలను జరిపింది. రేపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ జరిగే అవకాశం ఉంది.


                   హిమాచల్‌ నుంచి హర్యానాకు దత్తాత్రేయ బదిలీ


                  త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య


              మిజోరాం గవర్నర్‌గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు


                       కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌


                       గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌)

మరిన్ని వార్తలు