'మహమ్మారి ఇంకా ముగియలేదు'..అప్రమత్తంగా ఉండండని కేంద్రం లేఖ

21 Apr, 2023 19:31 IST|Sakshi

దేశంలో గత కొద్ది నెలలుగా కరోనా కేసుల తోపాటు మరణాలు సంభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్రం అప్రమత్తంగా ఉండాలంటూ విజ్ఞప్తి చేస్తూ.. ఎనిమిది రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఈ మేరకు లేఖలో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ భూషణ్‌.. దేశంలో కరోనా మహమ్మారి ఇంకా ముగిసిపోలేదు, అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే మహమ్మారి నిర్వహణలో మనం సాధించిన విజయ నిర్వీర్యం కాక మునుపే మేల్కోవాలి. ఏ స్థాయిలోనైన అలసత్వం వహించకూడదని ఆ లేఖలో తెలిపారు. కోవిడ్‌ కారణంగా ఆస్పత్రుల్లో  చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య తక్కువే అయినప్పటికీ  రాష్టాలు, జిల్లాల్ల వారిగా పెరుగుతున్న కేసులు వైరస్‌ సంక్రమణని సూచిస్తోందన్నారు.

అందువల్ల రోజువారిగా రాష్ట్రాలు, జిల్లాలోని పెరుగుతున్న కేసులు, పాజిటివిటీ రేటుని నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రారంభ దశలోనే కేసుల పెరుగుదలను నియంత్రించేలా అవసరమైన ప్రజారోగ్య చర్యలను చేపట్టాలని రాజేష్‌ భూషణ్‌ నొక్కి చెప్పారు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్‌, తమిళనాడు, రాజస్తాన్‌, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, హర్యాన, ఢిల్లీతో సహా ఎనిమిది రాష్ట్రాలు ఈ లేఖలను అందుకున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని జిల్లాలో యూపీ(1), తమిళనాడు(11), రాజస్తాన్‌(6), మహారాష్ట్ర(8), కేరళ(14), హర్యానా(12), ఢిల్లీ(11) తదితరాల్లో మొత్తంగా 10%కి పైగా పాజిటివిటి రేటు ఉంది.

ఆయ జిల్లాలోని కోవిడ్‌ నిఘాను పటిష్టం చేస్తూ.. ఇన్‌ఫ్లుఎంజా లాంటి అనారోగ్యం (ILI),  తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ ఇన్‌ఫెక్షన్ (SARI) వంటి కేసుల పర్యవేక్షించాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. ఇదిలా ఉండగా, దేశంలో తాజగా కొత్తగా 11,692 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య 66,170కి చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా  ఢిల్లీ ఆరోగ్య మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ..దేశ రాజధానిలో కోవిడ్‌ కేసులు స్థిరంగా ఉన్నాయన్నారు.

ఐతే ఇటీవల కొద్దిరోజులుగా మాత్రం కేసులు పెరుగుతున్నాయని, కాని రాబేయే రోజుల్లో  తగ్గే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో చాలా వరకు తీవ్రమైన అనారోగ్యాలు ఉన్నవారే  కావడం యాదృచ్చికం అన్నారు. ఏదైనా మరణాలు సంభవించడం అనేది దురదృష్టకరమని, ఇలా జరగకూడదన్నారు ఆరోగ్య మంత్రి భరద్వాజ్‌. 

(చదవండి: సూడాన్‌లోని భారతీయుల పరిస్థితిపై మోదీ అత్యవసర సమీక్ష!)

మరిన్ని వార్తలు