గంగా నదిలో కరోనా ఆనవాళ్లున్నాయా? 

8 Jun, 2021 01:56 IST|Sakshi

కేంద్రం వైరలాజికల్‌ సర్వే

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బిహార్‌లో గంగా నదిలో కొన్ని రోజుల క్రితం మృతదేహాలు తేలడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. అవి కరోనా బాధితుల మృతదేహాలేనన్న వాదన వినిపించింది. దీంతో గంగా నది పరిసరాల్లో నివసించే వారిలో ఆందోళన మొదలయ్యింది. ఈ నేపథ్యంలో నదిలో నిజంగా కరోనా (సార్స్‌–కోవ్‌–20) ఆనవాళ్లు ఉన్నా యా? అనేది తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఇందుకోసం దశలవారీగా వైరలాజికల్‌ సర్వే నిర్వహిన్నట్లు అధికార వర్గాలు సోమవారం తెలిపాయి.

మొదటి దశలో ఇప్పటికే కన్నౌజ్, పాట్నాలో 13 ప్రాంతాల్లో కొన్ని నమూనాలను సేకరించినట్లు లక్నోలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రిసెర్చ్‌ డైరెక్టర్‌ సరోజ్‌ బాతిక్‌ చెప్పారు.  నీటిలోని వైరస్‌లలో ఉండే ఆర్‌ఎన్‌ఏను వేరుచేసి, ఆర్‌టీ–పీసీఆర్‌ టెస్టు నిర్వహిస్తామని తెలిపారు. గంగా నదిలోని నీటిలో కరోనా వైరస్‌ ఉనికి ఉందా లేదా అనేది ఈ టెస్టు ద్వారా తెలిసిపోతుందన్నారు. నేషనల్‌ మిషన్‌ ఫర్‌ క్లీన్‌ గంగా (ఎన్‌ఎంసీజీ) నిర్ణయం మేరకు వైరలాజికల్‌ సర్వే చేపడుతున్నట్లు వెల్లడించారు.  

మరిన్ని వార్తలు