ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్

22 Aug, 2021 21:05 IST|Sakshi

కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగం కోల్పోయి తిరిగి విధుల్లో చేరిన ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఈపీఎఫ్ఓ చందాదారులకు 2022 వరకు ఉద్యోగుల చెల్లించే మొత్తంతో పాటు యాజమాన్యాలు చెల్లించే మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వమే చెల్లించనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ తెలిపారు. ఈపీఎఫ్​ఓ కింద నమోదు చేసుకున్న సంస్థల్లో ఉద్యోగం చేసే వారికి మాత్రమే ఈ నిబందన వర్తిస్తుందని పేర్కొన్నారు.(చదవండి: దాల్‌ సరస్సులో ఎస్‌బీఐ ఫ్లోటింగ్ ఎటిఎమ్)

అయితే, ఈ అవకాశం 2022 మార్చి 31 వరకు అందుబాటులో ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. రూ.15 వేలలోపు వేతనం కలిగిన వారికి ఈ బెనిఫిట్ వర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలి. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) పరిధిలోకి జూన్‌లో 12.83 లక్షల మంది కొత్తగా చేరారు. ఈ వివరాలను కేంద్ర కార్మిక శాఖ విడుదల చేసింది. జూన్‌లో కరోనా వైరస్‌ నెమ్మదించడం ఉద్యోగ కల్పనకు దారితీసినట్టు పేర్కొంది. ఈపీఎఫ్ఓ సభ్యులకు వారి పదవీ విరమణపై ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్ ప్రయోజనాలు, కుటుంబ పెన్షన్ & సభ్యుడు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకు బీమా ప్రయోజనాలను అందిస్తుంది.

మరిన్ని వార్తలు