వాహనదారులకు బిగ్‌ రిలీఫ్‌.. టోల్‌ వసూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం!

4 Oct, 2022 16:38 IST|Sakshi

హైవేలపై టోల్‌ ఫీజు వసూలు విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టోల్ వ‌సూళ్ల ప్ర‌క్రియ మ‌రింత స‌మ‌ర్ధంగా ఉండే విధంగా కొత్త విధానాన్ని తీసుకువచ్చింది. దీంతో, వాహనదారులకు కొంత మేరకు ఉపశమనం కలుగనుంది. 

వివరాల ప్రకారం.. ఇక నుంచి హైవేల‌పై వాహ‌నం ప‌రిమాణం, వాహ‌నం తిరిగిన దూరం ఆధారంగా టోల్ వ‌సూలు చేసే విధానం అమల్లోకి రానుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. వాహ‌నం సైజు, రోడ్డుపై అది ప్ర‌యాణించిన దూరం ఆధారంగా జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ వ‌సూలు చేయనున్నట్టు వెల్లడించింది. ఇందులో భాగంగానే కొత్త టోల్‌ విధానానికి అనుగుణంగా వాహ‌నం హైవేల‌పై ఎంత స‌మ‌యం, ఎంత దూరం ప్ర‌యాణించింద‌నే దాని ఆధారంగా టోల్ వ‌సూలు చేయనున్నారు. 

ఇదిలా ఉండగా.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ.. టోల్‌ప్లాజా వసళ్ల విషయంలో కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ప్రతీ 60 కిలోమీట‌ర్ల ప‌రిధిలో ఉండే క‌లెక్ష‌న్ పాయింట్స్ వ‌ద్ద టోల్ ట్యాక్స్ వ‌సూలు చేయ‌బోర‌ని గడ్కరీ స్పష్టం చేశారు. కాగా, 60 కిలోమీటర్ల మధ్యలో ఉండే టోల్‌బూత్‌లను వచ్చే మూడు నెలల్లో మూసివేస్తామని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు