మీడియా కమిషన్‌ ఏర్పాటు ఆలోచన లేదు: అనురాగ్‌ ఠాకూర్‌

25 Mar, 2022 05:09 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మీడియా కమిషన్‌ ఏర్పాటు చేయాలన్న ఆలోచనలేదీ లేదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ గురువారం రాజ్యసభలో తేల్చిచెప్పారు. మీడియాలో అవకతవకల విషయంలో ప్రభుత్వం తరచుగా భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరుపుతోందని, వివిధ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ఉపయోగించుకుంటోందని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ నేతృత్వంలో కమ్యూనికేషన్లు, ఐటీపై ఏర్పాటైన పార్లమెంటరీ స్థాయీ సంఘం తన నివేదికను గతంలో సమర్పించింది. మీడియాలో అవకతవకలను అరికట్టడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. భారత్‌లో మీడియా విశ్వసనీయత, సమగ్రతను క్రమంగా కోల్పోతోందని పార్లమెంటరీ స్థాయీ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. మీడియా రంగంలో పెడ ధోరణులను నియంత్రించడానికి మీడియా కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాల్సిన అససరం ఉందని ప్రతిపాదించింది. 

>
మరిన్ని వార్తలు