‘కో ఇన్‌ఫెక్షన్‌’పై కేంద్రం మార్గదర్శకాలు

14 Oct, 2020 12:22 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రస్తుతం కోవిడ్‌తో పాటు ఇతర సీజనల్‌ వ్యాధులు ప్రబలే అవకాశమున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మంగళవారం ఈ ‘కో ఇన్‌ఫెక్షన్‌’ను ఎదుర్కొనే దిశగా పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ సీజన్‌లో మలేరియా, డెంగ్యూ, చికన్‌ గున్యా, హెచ్‌1ఎన్‌1, స్క్రబ్‌ టైఫస్‌ తదితర వ్యాధులు ప్రబలే అవకాశముందని, అందువల్ల కరోనాతో పాటు, అవసరమైన చోట, ఆయా వ్యాధుల నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని సూచించింది.

సీజనల్‌ వ్యాధులు ఎక్కువగా ప్రబలే ప్రాంతాల్లో ఈ కో ఇన్‌ఫెక్షన్‌పై అప్రమత్తతతో వ్యవహరించాలని పేర్కొంది. కోవిడ్‌ సోకిన వారిలో ఇతర బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నాయేమో నిర్ధారించాలని సూచించింది. కోవిడ్‌ లక్షణాలు, ఇతర సీజనల్‌ వ్యాధుల లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని, అందువల్ల వ్యాధి నిర్ధారణలో అప్రమత్తంగా ఉండాలంది. కో ఇన్‌ఫెక్షన్‌ ఉన్న సందర్భాల్లో వ్యాధి నిర్ధారణలో తప్పుడు (ఫాల్స్‌ నెగటివ్‌/ఫాల్స్‌ పాజిటివ్‌) ఫలితం వచ్చే అవకాశముందని హెచ్చరించింది.
(చదవండి: కోవిడ్‌-19 : మృతుల్లో 45 శాతం వారే!)

మరిన్ని వార్తలు