Chennai Rains: తీరాన్ని తాకిన వాయుగుండం.. తమిళనాడులో 14 మంది మృతి

11 Nov, 2021 18:22 IST|Sakshi

సాక్షి, చెన్నై: గత కొద్ది రోజులుగా చెన్నైని వణికిస్తున్న వాయుగుండం తీరాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమ, తమిళనాడు జిల్లాలకు భారీ వర్ష సూచనలు ఉన్నాయి.

వాయుగుండం ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉంది. తిరుమల, తిరుపతిలోనూ భారీ వర్షం కురుస్తోంది. మరో రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉంది. 

పలు విమాన సర్వీసుల రద్దు
వర్షం, ఈదురు గాలులు కారణంగా విమానాలను రద్దు చేశారు. హైదరాబాద్‌, ముంబై, కోల్‌కతాకు విమానాలను మళ్లించారు. తమిళనాడు ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి తమిళనాడులో 14 మంది మృతి చెందారు. చెన్నై సహా 20 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది.

చదవండి: (తిరుపతి, తిరుమలలో భారీ వర్షం)

మరిన్ని వార్తలు