మాస్టారు అవతారం ఎత్తిన కలెక్టర్‌!

23 Feb, 2023 16:55 IST|Sakshi

వేలూరు(చెన్నై): వేలూరు కలెక్టర్‌ కుమరవేల్‌ పాండియన్‌ మాస్టారు అవతారం ఎత్తారు. విద్యార్థులకు పాఠాలు బోధించారు. సత్‌వచ్చారిలోని ప్రభుత్వ పాఠశాలను బుధవారం ఉదయం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అవసరమైన కనీస వసతులపై ఆరా తీశారు. విద్యార్థుల మరుగుదొడ్లు, వంట గదిలో దుర్వాసన రావడంతో టీచర్‌లపై కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శుభ్రం చేయాలని ఆదేశించారు.

ప్రతి రోజూ పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని తెలిపారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేశారు. అనంతరం విద్యార్థులకు స్వయంగా పాఠాలు బోధించారు. పాఠశాలలో విద్యార్థులకు తయారు చేసిన వంటను రుచి చూసి విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం వడ్డించాలని ఆదేశించారు. పాఠశాలకు బెంచ్‌లు కావాలని విద్యార్థులు కోరగా వెంటనే అందజేసేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

చదవండి   Pawan Khera: విమానం నుంచి దించేసి మరీ అరెస్ట్‌!

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు