పానీపూరీ తిని 77 మందికి అస్వస్థత.. వాంతులు, కడుపులో తిప్పడంతో..

22 Oct, 2021 18:37 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

చంఢీగడ్‌: బయట దొరికే చిరుతిండిలో ఎక్కువ మంది ఇష్టపడి మరీ తినేది ఏదని అడిగితే టక్కున చెప్పే పేరు పానీపూరీ. అయితే కొందరు మాత్రం నాణ్యత లేకుండా, తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా పానీపూరీ తినడం వల్ల కొంత మంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ ఘటన ఛత్తీస్‌గడ్‌లోని గటపార్‌ కాలా గ్రామంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..  స్థానికంగా నిర్వహించే మార్కెట్‌లో పానీపూరీ తినడం వల్ల 77 మంది అనారోగ్యం పాలైనట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. వీరిలో 57 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తొలుత వారిని మెడికల్‌ సెంటర్‌కు తీసుకెళ్లిన అధికారులు, మెరుగైన చికిత్స కోసం పెండ్రి ప్రాంతంలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో 26 మందిని బుధవారం ఉదయం డిశ్చార్జ్ చేయగా, మిగిలిన వారిని వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచారు. వారిని పరీక్షించిన వైద్యులు ఫుడ్‌ పాయిజనింగ్‌ జరగడం వల్లే అస్వస్థత పాలైనట్లు అధికారులకు వివరించారు. ఈ ఘటనపై విచారణ జరపనున్నట్లు అధికారులు తెలిపారు.

చదవండి: Priyanka Gandhi Vadra: అమ్మాయిలకు స్మార్ట్‌ఫోన్లు, స్కూటీలు 

మరిన్ని వార్తలు