రాజకీయాల్లో చిచ్చురేపిన అల్లుడి పెళ్లి బరాత్‌

10 May, 2021 16:18 IST|Sakshi

రాయ్‌పూర్‌: ఓ పెళ్లి బరాత్‌ ఛత్తీస్‌గఢ్‌లో తీవ్ర వివాదాస్పదమవుతోంది. పెళ్లి కొడుకు కాం‍గ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి దగ్గరి చుట్టరికం. ఉదయం పెళ్లికి కాగా సాయంత్రం బరాత్‌ పెట్టుకున్నారు. అయితే ఈ బరాత్‌కు పెద్ద ఎత్తున బంధువులు, స్నేహితులు పాల్గొన్నారు. ఎంతో ఆనందోత్సాహాల మధ్య బరాత్‌ జరిగింది. డప్పుచప్పుళ్లకు .. కొత్త కొత్త పాటలకు డ్యాన్స్‌లు చేశారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉందనే పట్టించుకోకుండా ఎంజాయ్‌ చేశారు. కోవిడ్‌నిబంధనలు ఉల్లంఘించారు. వారిపై కేసు నమోదైంది. 

ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మోహన్‌ మర్కంట్‌ మేనల్లుడి వరుసయ్యే వ్యక్తికి వివాహం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో ఎవరూ మాస్క్‌, శానిటైజర్‌ వంటివి పట్టించుకోలేదు. కనీసం భౌతిక దూరంగా కూడా పాటించలేదు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో తమ రాష్ట్రంలో తీవ్ర ఆంక్షలు ఉన్న విషయమే పట్టించుకోలేదు. ఈ బరాత్‌లో ఛత్తీస్‌ఘడ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు కూడా ఉండడం తీవ్ర వివాదమవుతోంది. 

బీజేపీ రాష్ట్ర ఉప అధ్యక్షురాలు లతా ఉసేండి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అయినంతా మాత్రానా కరోనా నిబంధనలు పాటించరా? అని ప్రశ్నించారు. ఆ బరాత్‌లో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్‌ స్వయంగా పాల్గొన్నారని ఆరోపించారు. మీరే నిబంధనలు పాటించకపోతే సామాన్యులెలా పట్టించుకున్నారని ప్రశ్నించారు. అయితే ఈ ఘటనపై మొహన్‌ మర్కంట్‌ వివరణ ఇచ్చారు. బరాత్‌లో తాను లేనని.. నియోజకవర్గ ఎమ్మెల్యేగా తనకు అభిమానులు ఉంటారని.. ఈ సమయంలో తన అల్లుడిగా ఎవరైనా తన పేరు చెప్పుకుని అలాంటి పని చేసి ఉంటారని తెలిపారు.

చదవండి: గంగానదిలో తేలిన కరోనా మృతదేహాలు
చదవండి: కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు