11 మంది కిడ్నాప్‌: త్రుటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే

20 Jul, 2021 16:23 IST|Sakshi

రాయ్‌పూర్‌: మావోయిస్టుల దాడి నుంచి ఓ ఎమ్మెల్యే త్రుటిలో తప్పించుకున్నారు. ఓ పర్యటనలో ఉండగా మావోయిస్టులు దాడులకు పాల్పడ్డారు. ఈ సమయంలో ఎమ్మెల్యే తప్పించుకోగా భద్రతా విధుల్లో ఉన్న ఓ జవాన్‌ మృతి చెందగా మరో జవాన్‌ గాయపడ్డారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణపూర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చందన్‌ కశ్యప్‌ మంగళవారం ఓర్చాలో పర్యటించారు. 

మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో భద్రతా దళాలు వెంటనే ఉన్నారు. ఎమ్మెల్యే పర్యటన విషయం తెలుసుకున్న మావోయిస్టులు ఎమ్మెల్యే పర్యటనపై దాడి చేశారు. ఒక్కసారిగా మావోయిస్టులు ఎదురుపడడంతో భద్రతా దళాలు ఎదుర్కొనేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు జరిగిన కాల్పుల్లో ఓ ఐటీబీపీ జవాన్‌ మృతి చెందాడు. ఇంకా మరొకరికి గాయాలయ్యాయి. ఈ దాడి నుంచి ఎమ్మెల్యే చందన్‌ సురక్షితంగా బయటపడ్డారు.

ఇదిలా ఉండగా సుక్మా జిల్లా జేగురుగొండలో మావోయిస్టులు కొందరిని కిడ్నాప్‌ చేశారనే వార్త కలకలం సృష్టించింది. ఏకంగా 11 మంది గిరిజనులను మావోయిస్టులు అపహరించుకుపోయారని తెలుస్తోంది. అయితే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ కోసం వెళ్లారనే కారణంతోనే వారిని మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారని వార్తలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు