పెళ్లి చేసుకోమని చెప్పలేదు: ఎస్‌ఏ బాబ్డే

8 Mar, 2021 17:57 IST|Sakshi
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బాబ్డే (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)

విమర్శలపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

న్యూఢిల్లీ: ‘‘మహిళలు అంటే మాకు చాలా గౌరవం.. వారిని కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు’’ అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ ఏ బాబ్డే. గతవారం ఓ అత్యాచార నిందితుడి బెయిల్‌ పిటీషన్‌ విచారణ సందర్భంగా కోర్టు.. ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకుంటావా.. లేక జైలుకెళ్తావా’’ అని నిందితుడిని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై దేశ వ్యాప్తంగా దుమారం రేగింది.

ఈ క్రమంలో అనేక మంది మహిళా హక్కుల కార్యకర్తలు, ప్రముఖ పౌరులు, మేధావులు, రచయితలు, కళాకారులు చీఫ్ జస్టిస్ బొబ్డేకు క్షమాపణ చెప్పాలని.. ఆయన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఆయన ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి వైదొలగాలని కోరుతూ 5,000 మందికి పైగా ప్రజలు పిటిషన్‌లో సంతకం చేశారు.

ఈ క్రమంలో వీటిపై ఎస్‌ ఏ బాబ్డే స్పందించారు. తన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించారని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘బెయిల్‌ పిటిషన్‌ విచారణలో భాగంగా మేం నిందితుడిని ‘‘నీవు పెళ్లి చేసుకోబోతున్నావా’’ అని మాత్రమే ప్రశ్నించాము. అంతేతప్ప ‘‘బాధితురాలిని పెళ్లి చేసుకో.. లేదంటే జైలుకెళ్తావ్’’‌ అని చెప్పలేదు. అలా ఎన్నిటికి చెప్పం. కోర్టు వ్యాఖ్యలని వక్రీకరించారు. ఈ సంస్థ, ముఖ్యంగా ఈ బెంచ్, స్త్రీత్వం పట్ల అత్యధిక గౌరవం కలిగి ఉంది’’ అని తెలిపారు.

చదవండి:
పెళ్లి చేసుకుంటావా.. జైలుకెళ్తావా?‌: సుప్రీంకోర్టు
వాళ్లిద్దరి మధ్య శృంగారాన్ని రేప్‌ అంటారా: సుప్రీం

మరిన్ని వార్తలు