పంజాబ్‌ సీఎంపై సంచలన ఆరోపణలు... ఆయన ఫుల్‌గా తాగింది నిజమేనా?

19 Sep, 2022 15:59 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ జర్మనీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఐతే ఆయన ఢిల్లీలోని ఆప్‌ జాతీయ సమావేశానికి హాజరుకావాల్సి ఉండగా...సమయానికి పర్యటన ముగించుకుని రాలేకపోయారు. అంతేకాదు ఆయన అనారోగ్యంతో ఫ్రాంక్‌ఫర్ట్‌ నుంచి ఢిల్లీకి తిరిగి రావడం ఆలస్యం అయ్యిందని  సీఎం కార్యాలయం కూడా వెల్లడించింది.

ఐతే సీఎం భగవంత్‌ మాన్‌ మద్యం మత్తులో ఉన్నందునే ఆలస్యమైందని, ఆయన్ను ఫ్లైట్‌ నుంచి దించేశారంటూ పలు వార్తలు గుప్పుమన్నాయి. అందువల్లే ఆయన ఢిల్లీకి రావడం ఆలస్యమైందంటూ వార్తలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ ప్రతిపక్షాలు ఆప్‌ని డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు భగవంత్‌ మాన్‌ సహా ప్రయాణికుడు ఆయన ఫుల్‌ తాగి ఉండటం వల్ల లుఫ్తానా ఎయిర్‌ పోర్టులో భగవంత్ మాన్‌ను విమానం నుంచి దించేశారని, పైగా ఆయన నడవలేకపోవడంతో భార్య, భద్రతా సిబ్బంది సాయం కూడా తీసుకున్నారని ట్విట్టర్‌లో పేర్కోన్నాడు. 

ఈ పోస్ట్‌ని కాంగ్రెస్‌ పార్టీ షేర్‌ చేస్తూ ఆప్‌ని ఈ విషయం పై క్లారిటీ ఇవ్వాల్సిందేనని పట్టుపట్టింది. ఈ క్రమంలో అకాలీదళ్‌ నేత సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ భగవంత్‌ మాన్‌పై విమర్శలతో విరుచుకుపడ్డాడు. భగవంత్‌ మాన్‌ తీరు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంజాబీలను సిగ్గుపడేలా చేసిందన్నారు. భారత ప్రభుత్వం ఈ విషయంపై జోక్యం చేసుకుని పదవి నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు.

అంతేగాదు జర్మనీ దేశాన్ని ఈ విషయమై విచారించాలంటూ పెద్ద ఎత్తున్న విమర్శలు ఎక్కుపెట్టారు. ఐతే ఆప్‌ అధికార ప్రతినిధి మల్విందర్‌సింగ్‌ కాంగ్‌ మాట్లాడుతూ....సీఎం సెప్టెంబర్‌ 19న షెడ్యూల్‌ ప్రకారం తిరిగి వచ్చారు. మాన్‌ తన విదేశీ పర్యటనలతో విదేశీ పెట్టుబడులు తీసుకువస్తున్నారన్న అక్కసుతో ప్రతిపక్షాలు ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. అంతగా కావలనుకుంటే లుఫ్తాన్స్‌ ఎయిర్‌లైన్స్‌లో తనిఖీ చేసుకోండి అని సవాలు విసిరారు. 

(చదవండి: చండీగఢ్‌ యూనివర్సిటీ వీడియో లీక్‌ ఘటన.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. మహిళా అధికారులతో సిట్‌)

మరిన్ని వార్తలు