పిల్లల నుంచే కరోనా ప్రమాదం ఎక్కువ

5 Sep, 2020 18:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి పిల్లలపై పెద్దగా ప్రభావం చూపించడం లేదని, వైరస్‌ సోకినప్పటికీ పిల్లలుపై దాని ప్రభావం పెద్దగా ఉండడం లేదని, వైరస్‌ సోకినప్పుడు కొందరు పిల్లల్లో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, మరి కొందరిలో అసలు అలాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదని, అతి తక్కువ పిల్లలలపై మాత్రమే ‘కవసాకి వ్యాధి’ లాగా తీవ్ర ప్రభావం చూపిస్తోందంటూ వైద్య నిపుణుల నుంచి కరోనా వ్యాపిస్తోన్న తొలినాళ్లలో వినిపడిన వాదన. పిల్లల విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా భరోసా ఇచ్చింది. (ఇలా కూడా కరోనా వస్తుందంటే.. నమ్మలేం!)

ఈ నేపథ్యంలో భారత్‌ సహా పలు దేశాల పిల్లల విషయంలో పెద్దలు నిర్లక్ష్యం వహించారు. పిల్లలు సరైనా మాస్కులు లేకుండా ఆట పాటల్లో గడుపుతున్నారు. ఎదుగుతున్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతోంది కనుక వారి ఆరోగ్యం కరోనా వైరస్‌ పెద్దగా ప్రభావం చూపించలేక పోవచ్చునుగానీ, వారి ద్వారా పెద్దలు, ముఖ్యంగా కుటుంబ సభ్యులు వైరస్‌ బారిన పడి మత్యుగుహలోకి అడుగు పెడుతున్నారని ‘ది జర్మన్‌ సొసైటీ ఫర్‌ వైరాలోజీ’ తాజాగా హెచ్చరించింది. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ పిల్లల విషయంలో పాటించాల్సిన కొన్ని మార్గదర్శకాలను వివరించింది.

12 ఏళ్లు, ఆపై వయస్సున్న పిల్లలంతా విధిగా నోరు, ముక్కు కవరయ్యేలా మాస్కులు ధరించాలని. ఆరేళ్ల నుంచి 12 ఏళ్ల లోపు పిల్లలు కూడా స్వచ్ఛందంగా మాస్కులు వేసుకునేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్కూలు వెళ్లే ప్రతి పిల్లవాడు మాస్కు ధరించాలని సూచించింది. స్పెయిన్‌లో కరోనా వైరస్‌ సోకినా 60 వేల మందిపై యాండీ బాడీస్‌ పరీక్షలు నిర్వహించగా, వారిలో 3.4 శాతం పిల్లలు ఉన్నారని తేలింది. వారి అందరిలో యాంటీ బాడీస్‌ అభివద్ధి చెందినట్లు తేలడం సంతోషకరమైన వార్త. పెద్ద వాళ్లలో కేవలం 4. 4 నుంచి ఆరు శాతం మందిలో మాత్రమే యాంటీ బాడీస్‌ ఉన్నట్లు గుర్తించారు. కనుక పిల్లల విషయంలో పెద్దలే జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. 

మరిన్ని వార్తలు