కశ్మీర్‌పై చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. రెండు రోజులకే జై శంకర్‌తో భేటీ

25 Mar, 2022 12:48 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ శుక్రవారం విదేశాంగశాఖ మంత్రి ఎస్ జైశంకర్‌తో భేటీ అయ్యారు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో.. పలు అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఆగ్నేయాసియా దేశాల పర్యటనలో భాగంగా పాకిస్థాన్ పర్యటన ముగించుకొని గురువారం సాయంత్రం వాంగ్ యీ ఢిల్లీ చేరుకున్నారు. జైశంకర్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్‌తోనూ సమావేశం అయ్యారు. అయితే పాకిస్తాన్‌ పర్యటనలో ఉన్న సమయంలో కశ్మీర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వాంగ్‌ యూ.. తాజాగా భారత్‌లో పర్యటించడం గమనార్హం.

గల్వాన్ ఘటన తర్వాత సీనియర్ స్థాయి చైనా నేత భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. వాంగ్ యూ, జైశంకర్ భేటీలో ఇరు దేశాల సరిహద్దు సమస్యలు.. ఉక్రెయిన్‌పై రష్యా దాడిపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.. అదే విధంగా ఆప్గనిస్తాన్‌లోని పరిస్థితిపై కూడా వారు చర్చించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగాం ఢిల్లీకి రాకముందు వాంగ్‌ యి తన మూడు రోజుల పాకిస్తాన్‌ పర్యటన తర్వాత అప్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు.
దవండి: రాజ్యసభ ఎన్నికల్లో ‘ఆప్‌’ విజయం.. ఎంపీలుగా హర్భజన్‌, అశోక్‌ మిట్టల్...

కాగా  ఇస్లామాబాద్‌లో మంగళవారం పాకిస్తాన్‌లోని ఇస్లామిక్ సహకార సంస్థ సదస్సులో ప్రసంగించిన వాంగ్ యీ జమ్మూకశ్మీర్ గురించి ప్రస్తావించారు. కశ్మీర్‌ విషయాన్ని ఓఐసీ సదస్సలు పలు ఇస్లామిక్‌  మిత్ర దేశాలు ప్రస్తావించాయని, చైనా కూడా అదే కోరుకుంటుందని వ్యాఖ్యానించారు. అయితే ఆయన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. జమ్మూ కాశ్మీర్‌కు సంబంధించిన విషయాలు పూర్తిగా భారత అంతర్గత వ్యవహారాలని, చైనాతో సహా ఇతర దేశాలకు మాట్లాడే హక్కు లేదని పేర్కొంది. భారత్‌ తమ అంతర్గత సమస్యలపై ఇతరుల జోక్యం కోరదని గ్రహించాలని తెలిపింది. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన రెండు రోజులకే చైనా విదేశాంగ మంత్రి భారత్‌ పర్యటన చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
చదవండి: foreign-minister

మరిన్ని వార్తలు