కొత్త ఏడాదిలో చైనాలో రోజుకు... 25 వేల కోవిడ్‌ మరణాలు

1 Jan, 2023 06:00 IST|Sakshi

న్యూఢిల్లీ: చైనాలో కొత్త ఏడాదిలో కరోనా అత్యంత తీవ్ర స్థాయికి చేరనుంది. ఈ నెల 13వ తేదీ కల్లా రోజుకు 37 లక్షల కేసులు నమోదవుతాయని, మరో 10 రోజుల తర్వాత రోజుకు 25 వేల కరోనా మరణాలు సంభవిస్తాయని యూకేకు చెందిన అధ్యయన సంస్థ ఎయిర్‌ ఫినిటీ తెలిపింది.

డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి చైనాలో కరోనాతో రోజుకు 9 వేల మంది చొప్పున చనిపోతున్నారని తెలిపింది. జనవరి చివరి నాటికి చైనాలో 5,84,00 కోవిడ్‌ మరణాలు చోటుచేసుకుంటాయని పేర్కొంది. ఏప్రిల్‌ కల్లా కోవిడ్‌తో మృతుల సంఖ్య 17 లక్షలకు చేరుకుంటుందని తెలిపింది. మార్చి 3వ తేదీ నుంచి మరో విడత విజృంభణతో రోజుకు 42 లక్షల కేసులు నమోదవుతాయని అంచనా వేసింది.

మరిన్ని వార్తలు